ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఆయనకు విషెస్ తెలిపేందుకు తిరుపతి అలిపిరి నుంచి ఈశ్వరయ్య అనే వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టి 12 రోజులు ప్రయాణించి చిరంజీవిని కలిశారు. అలాగే తమ్ముడు పవన్ కల్యాణ్ ని కలవాలని అడిగిన ఆ అభిమానికి కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు చిరు. అనంతరం ‘భీమ్లా నాయక్’ సెట్ లో పవన్ ను కలిశాడు.
ఈ సందర్భంగా చిరంజీవి ‘తనను కలిసేందుకు అభిమానికి అంత శక్తి ఎలా వచ్చిందో అంటూ ఆశ్చర్యపోయారు. ఈ సాహసం సరికాదని వారించారు. చాలా సందర్భాల్లో చెప్పాను. మాకు అభిమానుల ప్రేమ ఆదరణ గొప్ప ఎనర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మనసు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించినట్టే మేం కూడా వారు వారి కుటుంబ సభ్యులు బావుండాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను’ అని అన్నారు.