Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు స్టార్ హీరోలతో సమానంగా చిన్న పిల్లల పాత్రలు కూడా థియేటర్లలో మ్యాజిక్ సృష్టిస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో సరిగ్గా అదే రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకుని మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు బాలనటుడు మాస్టర్ రేవంత్. విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లిరాజు పాత్రలో అదరగొట్టిన ఈ బుడ్డోడుకి ఇప్పుడు టాలీవుడ్ లో డిమాండ్ మాములుగా లేదు.
సినిమా సక్సెస్‌లలో తన నటనతో కీలక పాత్ర పోషిస్తున్న బుల్లిరాజు రెమ్యూనరేషన్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బుల్లిరాజు ప్రస్తుతం రోజుకు దాదాపు రూ. 1 లక్ష వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. టాలీవుడ్లో ఒక బాలనటుడికి రోజువారీ ప్రాతిపదికన ఈ స్థాయి పారితోషికం అంటే భారీ అమౌంట్ అనే చెప్పాలి. ఈ క్రేజ్‌తో ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టుల జాబితాలో బుల్లిరాజు అగ్రస్థానానికి చేరుకున్నాడు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్, సహజమైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఈ చిన్నారికి బ్యాక్-టు-బ్యాక్ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కేవలం ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన బుల్లిరాజు ఆ తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో వెండితెరపై తన సక్సెస్ గ్రాఫ్‌ను జెట్ స్పీడ్‌తో పెంచుకుంటూ వెళ్తున్నాడు. బుల్లిరాజుకు ఉన్న క్రేజ్ చూసి టాలీవుడ్ మేకర్స్ సైతం తమ సినిమాల్లో ప్రత్యేక పాత్రలను డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ రాబోయే సరికొత్త ప్రతిష్టాత్మక చిత్రంలో బుల్లిరాజు మరోసారి కీలక పాత్రలో మెరవబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న ఈసినిమాతో బుల్లిరాజు ఖాతాలో మరో హిట్ వచ్చిచేరబోతోంది.
Also Read
- Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
- Suriya: ‘‘ఈ సక్సెస్‌ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
- Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!