అభిరుచి గల చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్నారు చెరుకూరి సుధాకర్. ఇక యువ కథానాయకుడు నాగశౌర్య సైతం భిన్నమైన చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్రవేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సోమవారం ఓ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ప్రొడక్షన్ నెం. 6 గా ప్రారంభమైన ఈ మూవీ ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో నాగ శౌర్య సరసన మోడల్ యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.


ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగ శౌర్యకు వున్న క్రేజ్ కి తగినట్లు ఫన్-ఫిల్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వుంటుందని, పవన్ యూనిక్ స్క్రిప్ట్, ట్రీట్మెంట్ తో ఈ సినిమాని చాలా ప్రత్యేకంగా రూపొందించబోతున్నాడని నిర్మాత చెరుకూరి సుధాకర్ తెలిపారు. నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’కి అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్ అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.