ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో దీపికా పదుకొనె సందడి చేయనుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న”83″ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 30న ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా… దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది.
Read Also : సెన్సార్ పూర్తి చేసుకున్న “పుష్ప”రాజ్… ఇక మిగిలింది ఇదే!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఫైనాన్షియర్ కంపెనీ ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టులో ’83’ నిర్మాతలపై చీటింగ్ ఫిర్యాదును దాఖలు చేసింది. ఈ మేరకు ఫ్యూచర్ రిసోర్సెస్ FZE అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. సమాచారం ప్రకారం ఫ్యూచర్ రిసోర్సెస్ ఎఫ్‌జెడ్‌ఇ ప్రతినిధులు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే ఆలోచనతో విబ్రి మీడియాను కలిశారు. విబ్రి సంస్థ వారిని సినిమా హక్కుల పేరుతో నమ్మబలికి ఎఫ్‌జెడ్‌ఇని విబ్రితో కలిసి రూ.15.90 కోట్లు ఖర్చు చేసేందుకు ఒప్పించారని ఫిర్యాదులో ఆరోపించారు. తీరా ఇప్పుడు చూస్తే సినిమా హక్కుల విషయంలో తాను మోసపోయానని ఫిర్యాదుదారు తెలిపారు.
Read Also : బాలయ్యకు హీరోయిన్ సాష్టాంగ నమస్కారం
విబ్రి మీడియా డైరెక్టర్ పై భారతీయ శిక్షాస్మృతిలోని 406, 420, 120బి సెక్షన్ల కింద చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది రిజ్వాన్ సిద్ధికీ ద్వారా దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో నిందితులు “83” చిత్రాన్ని నిర్మించారని, చిత్రం హక్కుల విషయంలో ఫిర్యాదుదారుని మోసం చేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. విబ్రి మీడియా డైరెక్టర్లు ఏప్రిల్ 2012 నుండి మార్చి 2020 వరకు సినిమా వ్యాపార ప్రణాళికలు, లాభ నష్టాల అంచనాలను సమర్పించారని, ఫిర్యాదుదారు కంపెనీని ఇందులో రూ. 15.90 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.