Charmee Kaur: నటి, నిర్మాత ఛార్మీ కౌర్ ప్రస్తుతం లైగర్ సినిమా పరాజయంతో నిరాశలో ఉన్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ పరాజయాన్ని చవిచూసింది. పాన్ ఇండియా సినిమా అని, కోట్లు ఖర్చుపెట్టామని ఛార్మీ ఈ సినిమాకు చేసిన ప్రమోషన్ చూసి థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులు పూర్తి సినిమా చూడకుండానే లేచి వచ్చేశారు. ఇక సినిమా ప్లాప్ కావడంతో ఛార్మీ ను నెటిజన్లు ఏకిపారేశారు. దీంతో అమ్మడు సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే బ్రేక్ అని చెప్పి నాలుగు రోజులు కూడా కాకముందే మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేసి షాక్ ఇచ్చింది.
గత కొన్ని రోజులుగా పూరి గురించి కొన్ని రూమర్స్ నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే. అద్దె కూడా కట్టలేని స్థితిలో పూరి ముంబై నుంచి హైదరాబాద్ కు మకాం మారుస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఛార్మీ స్పందిస్తూ నెటిజన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “రూమర్స్.. రూమర్స్.. రూమర్స్.. అన్ని రూమర్స్ ఫేక్. పూరి కనెక్ట్స్ పై దృష్టి సారిస్తున్నాం. మరోవైపు ఈ రూమర్స్.. రిప్ రూమర్స్” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ తో మరోసటీ నెటిజన్లు ఛార్మీ తో ఆడేసుకున్నారు. బ్రేక్ అంటే నాలుగురోజులేనా..? అని కొందరు. నువ్వు హ్యాపీయే.. పాపం డిస్ట్రిబ్యూటర్లే నాశనం అయిపోయారని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Rumours rumours rumours!
All rumours are fake!
Just focusing on the progress of 𝐏𝐂 ..
Meanwhile, RIP rumours !!— Charmme Kaur (@Charmmeofficial) September 8, 2022