మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని సోదరి అనుష్పల తన ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంను నిన్న వివాహం చేసుకున్నారు. ఇక పెళ్ళికి ముందు జరిగిన సంగీత్, ముఖ్యంగా పెళ్లికి ముందు జరిగిన వేడుకల నుండి చరణ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాయి. తాజాగా అనుష్పల వివాహానికి రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ కూడా హాజరైన పిక్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఈ సెలెబ్రిటీ దంపతులతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడు. పిక్ లో ముగ్గురూ అద్భుతంగా కన్పిస్తున్నారు. మిహీకా ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటోను పంచుకుంటూ “చివరకు రానా దగ్గుబాటి అందంగా పెరిగాడు” అని రాసుకొచ్చింది.
Read Also : సీనియర్ హీరోయిన్ షాకింగ్ లుక్… ఇంత స్లిమ్ గా ఎలా ?
రానా నలుపు రంగు సూట్లో అందంగా కనిపిస్తుండగా, చరణ్ కుర్తా ప్యాంట్లో క్లాసీగా కనిపిస్తున్నాడు. అందమైన మిహీకా రఫుల్ డ్రెస్, జాకెట్లో చాలా స్వీట్గా కనిపిస్తుంది. చరణ్, రానా కలిసి తొమ్మిదో తరగతి వరకు చెన్నైలోని ఒకే స్కూల్లో చదువుకున్నారని, వాళ్ళు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా ఉన్న విషయం తెలిసిందే.