Chandrayaan Trailer: చంద్రయాన్ మూవీ ట్రైలర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan Trailer: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్, నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న సరికొత్త చిత్రం ‘చంద్రయాన్’. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. హిలేరియస్ అడ్వెంచర్ కామెడీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 13న థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన ‘చంద్రయాన్’ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కేవలం ఐదు దేశాలు మాత్రమే చంద్రుడిపైకి తమ స్పేస్‌క్రాఫ్ట్‌లను విజయవంతంగా పంపగలిగాయి. అలాంటి భారీ ప్రయోగాన్ని.. అస్సలు లెక్కలు, ఎక్కాలు కూడా రాని మందమర్రి అనే చిన్న ఊరిలోని నలుగురు లోకల్ కుర్రాళ్లు చేస్తే ఎలా ఉంటుందనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. గూగుల్ సాయంతో ఇంట్లోనే రాకెట్ తయారు చేసి, ఊరంతా తమవైపు, ప్రపంచమంతా తమ పల్లెటూరి వైపు చూసేలా చేయాలని ఈ కుర్రాళ్లు ప్లాన్ చేస్తారు.
Also Read
ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయే పంచ్‌లు, ఫన్నీ సీన్లతో సాగింది. రాకెట్‌కు ఫ్యూయల్ (ఇంధనం) కోసం తవుడు వాడటం, అక్కడి వాతావరణంలో జీవం బతుకుతుందో లేదో పరీక్షించడానికి ఏకంగా ఓ కోడిని అద్దెకు తీసుకురావడం వంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. సైన్స్‌కే సరికొత్త ట్విస్టులు ఇచ్చే ఈ లోకల్ సైంటిస్టుల పిచ్చి ప్రయోగాలు ఊరికి ఏదో కీడు తెచ్చిపెడతాయని గ్రామస్థులు భయపడతారు. సరిగ్గా అదే సమయంలో గ్రామంలో ఒక హత్య కేసు వెలుగులోకి రావడం, బాబా భాస్కర్ క్యారెక్టర్ ఎంట్రీతో కథలో థ్రిల్, క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఎవరూ తమ ప్రయత్నాన్ని నమ్మకపోయినా, ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా.. చేతికి దొరికిన వస్తువులతో ఈ నలుగురు కుర్రాళ్లు రాకెట్‌ను ఎలా నిర్మించారు? చివరకు తమ చంద్రయానాన్ని పూర్తి చేశారా లేదా? అన్నది తెరపై చూడాల్సిందే. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వినోదాత్మక చిత్రం నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్‌గా వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
తాజావార్తలు
-
Chandrayaan Trailer: చంద్రయాన్ మూవీ ట్రైలర్ చూశారా!
-
Illegal IVF Centres : ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
-
AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
-
Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!