Vivek Chepuri : హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఈమధ్య ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు విలన్ అంటే కేవలం హీరో చేతిలో దెబ్బలు తినడానికే అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు హీరోకి దీటుగా.. కొన్నిసార్లు హీరోని డామినేట్ చేసే స్థాయిలో విలనిజం పండిస్తున్నారు మన యువ నటులు. సరిగ్గా ఇలాంటి కోవలోకే వస్తాడు వివేక్ చేపూరి. తెరపై తన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను అక్షరాలా భయపెట్టిన ఈ ‘కల్ట్’ యాక్టర్.. ఇప్పుడు ఏకంగా హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమై, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు. 2019లో వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా యూత్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు ఎదురు నిలబడి, తన అగ్రెసివ్ విలనిజంతో గట్టి పోటీ ఇచ్చిన ‘రవి’ క్యారెక్టర్‌ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. మళ్లీ సరిగ్గా ఏడేళ్ల తర్వాత అదే విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్ట్’ సినిమాలో వివేక్ మరోసారి రెచ్చిపోయాడు. ఇందులో ‘ఇషాన్’ అనే పాత్రలో వివేక్ చేపూరి నటన చూసి థియేటర్లలో జనాలు గడగడలాడిపోయారు.
‘కల్ట్’లో ఇషాన్ గా వివేక్ పండించిన క్రూరత్వం, ఆ యాటిట్యూడ్‌కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇతడి క్యారెక్టర్‌కు సంబంధించిన వీడియోలు, ఎడిట్ చేసిన మాస్ రీల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినప్పటికీ, ఆడియన్స్ నుంచి ఈ రేంజ్లో వస్తున్న ప్రేమను చూసి వివేక్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పరితపించే వివేక్.. విలన్‌గా పీక్స్‌లో ఉన్నప్పుడే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దర్శకుడు టి. శరత్ చంద్ర తెరకెక్కిస్తున్న ఓ భారీ ప్రాజెక్టుతో ఏకంగా మెయిన్ లీడ్‌గా (హీరోగా) మారబోతున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఏకకాలంలో ద్విభాషా (బైలింగ్వల్) చిత్రంగా ఇది రూపొందుతుండటం విశేషం. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ప్రియేష్ గురుస్వామి ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. హీరోగా వివేక్ చేపూరి అసలు విస్వరూపం ఎలా ఉండబోతోందో చూపించేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ నవంబర్లోనే సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ గ్లింప్స్ లేదా టీజర్‌ను వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
- Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
- Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
- Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
తాజావార్తలు
-
Vivek Chepuri : హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!