Chandramukhi 2: రారా.. సరసకు రారా.. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో చంద్రముఖి సినిమా చూసి వారం రోజులు నిద్ర కూడా పోకుండా భయపడినవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ సినిమా ప్రేక్షకులను భయపెట్టింది. భయపెట్టి.. రికార్డులు కొల్లగొట్టింది. రజినీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాకు పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 13 ఏళ్ళ తరువాత సీక్వెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. లారెన్స్, కంగనా రనౌత్, రాధికా, వడివేలు ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం చంద్రముఖి 2. పి.వాసునే ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ .. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Hyper Aadi: ఆ యాంకర్ తో హైపర్ ఆది పెళ్లి.. ?
తాజాగా ఈ సినిమా నుంచి లారెన్స్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమాలో లారెన్స్.. రాజా వెంకటపతి రాజుగా కనిపించనుండగా.. కంగనా చంద్రముఖిగా కనిపించనుంది. ఇక రాజా వెంకటపతి రాజు పోస్టర్ ను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ ను లారెన్స్ షేర్ చేస్తూ.. “రాజాధిరాజా..రాజ గంభీర.. రాజా మార్తాండ.. రాజాకులశేఖర.. వెంకటపతిరాజశేఖర.. వేంచేస్తున్నారు.. పరాక్.. బహుపరాక్” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా.. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో చంద్రముఖి 2 సినిమా వినాయకచవితికి రిలీజ్ కానున్నట్లు తెలిపాడు. మరి ఈ సినిమాతో లారెన్స్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Rajadhi raja, Raja ghambira, Raja marthanda, Raja kula thilagaa… Vettaiyan Raja paraak paraak paraak!! 🕴️🗝️
Watch this space at 10AM tomorrow as we unveil the look of our #Vettaiyan 👑
Chandramukhi-2 releasing in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada this Ganesh… pic.twitter.com/TAf8HhZFDQ
— Raghava Lawrence (@offl_Lawrence) July 30, 2023