Chandrababu Naidu: నందమూరి తారకరత్న మృతిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తారకరత్న మామయ్య నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. నారా లోకేష్ పాదయాత్రలోనే తారకరత్న కుప్పకూలిపోవడం పై ఆయన అంతకుముందు మీడియా ముందు మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఇక నేడు ఆయన కన్నుమూయడంపై చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. తారకరత్నతో తనకున్న బంధాన్ని ట్వీట్ రూపం లో చెప్పుకొచ్చారు.
Nara Lokesh : బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు
“నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించింది. తారకరత్నను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదు.23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇకపోతే గతంలో తారకరత్న, చంద్రబాబుతో భేటీ అయ్యి ఈసారి ఎన్నికల్లో పాల్గొంటానని అడిగినట్లు సమాచారం. చంద్రబాబు తరువాత నారా లోకేష్ ను తారకరత్న మీట్ అవ్వడం, ఆయన కూడా లోకేష్ పాదయాత్ర తరువాత తన రాజకీయ ప్రవేశం ఉండనుందని చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న… చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) February 18, 2023