Chandrababu: వైసీపీ అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్.. తప్పుడు రాజకీయం అంటూ బాబు ఘాటు వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Comments on Allu Arjun Visiting Shilpa RaviChandra Reddy House: నంద్యాల YCP MLA అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఆయన తనకు మంచి స్నేహితుడని, పాలిటిక్స్ లోకి రాకముందు వారానికోసారి కలిసే వాళ్లం కానీ ఐదేళ్లుగా ఆరు నెలలకోసారే కలుస్తున్నాం. ఇక్కడే తెలుస్తోంది కదా అతను ఎంత కష్టపడుతున్నాడో, ప్రజల కోసం ఇంత కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి ఇక్కడకు వచ్చా, ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అయితే ఇదిలా ఉండగా చంద్రబాబు అల్లు అర్జున్ పర్యటన మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుఅల్లు అర్జున్ వస్తే, జనసేన జెండాలు పెట్టుకుని ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరైనా చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అల్లు అర్జున్ మీ ఇంటికి వచ్చాడు, తప్పు లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జెండాలు వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా? కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Allu Arjun: చర్చగా మారిన అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. ఏంటి పుష్ప ఇది..?
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
అది తప్పు అవునా? కాదా? అని ప్రశ్నించారు. అన్నీ చీకటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు. ఒక పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు అంతే తేడా. సండే ఎమ్మెల్యే అని అంటూ శిల్పా రవిని విమర్ర్శించారు. అతను సండే మాత్రమే వస్తాడని, ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా పంపించేద్దాం అని అన్నారు. ఎక్కడైనా ఫ్యాన్ తిరిగితే అక్కడికి గొడ్డలి వస్తుందని పేర్కొన్న ఆయన మీ బాబాయ్ ని ఎవరు చంపారో ఇప్పటికైనా నిజం చెప్పమని అన్నారు. చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే అన్న ఎవరైనా ఉంటారా?? నేను వస్తే పథకాలు ఉండవని ప్రచారం చేస్తున్నారు…నేను పేదల పక్షాన ఉంటానని అన్నారు. జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటికీ డబ్బులు పడలేదని ఆయన అన్నారు. ఇక 99 శాతం హామీలు పూర్తి చేశాడట…..మీ జీవితంలో మార్పు వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో, విశాఖలో, ఇడుపుల పాయలో, బెంగుళూరులో ప్యాలెస్ కట్టుకున్నాడని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!