Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నిహారిక నిర్మాతగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇక నేడు నిహారిక తన 29 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. మెగా హీరోస్ అందరు కలిసి ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఇక నిహారిక భర్త చైతన్య.. భార్య పుట్టినరోజుకు అరుదైన బహుమతిని అందించాడు. నిహారిక పేరు మీద రెండు ఏనుగులను దత్తత తీసుకున్నాడు. వాటి సంరక్షణ మొత్తం ఈ జంటనే చూసుకోనున్నది. ఈ వీడియోను నిహారిక పోస్ట్ చేస్తూ భర్త గిఫ్ట్ కు తబ్బిఉబ్బిపోయింది.
ఇక వీడియోలు ఒక తల్లి ఏనుగు పిల్ల ఏనుగు పరిగెత్తుకుంటూ నిహారిక దగ్గరకు వస్తూ ఉన్నాయి.. ఇక కింద హ్యాపీ బర్త్ డే నిహ అని పువ్వులతో రాసి బర్త్ డే విషెస్ తెలిపాడు. ఇక ఈ వీడియోను నిహారిక షేర్ చేస్తూ నేను పరిగెత్తలేకపోతున్నాను.. థాంక్స్ చై ఇంతమంచి గిఫ్ట్ ఇచ్చినందుకు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ జంట రెండేళ్ల క్రితం వివాహంతో ఒక్కటి అయ్యారు. ఉదయ్ పూర్ లో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.