ఆనంద్ దేవరకొండ తన కెరీర్ ప్రారంభం నుండి ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ అయిన “గం గం గణేశా” చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నాడు. ఆనంద్ తాజాగా ఓ వీడియో ద్వారా “గం గం గణేశా” ఆడిషన్స్ విషయాన్ని ప్రకటించారు.
Read Also : Godfather : మేజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో ఆనంద్ హీరో పాత్ర కోసం ఆడిషన్ చేస్తున్నాడు. షార్ప్‌గా, ఎనర్జిటిక్‌గా కన్పించిన ఈ హీరో ఆడిషన్స్ విషయాన్నీ కూడా స్మార్ట్ గా వెల్లడించాడు. సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కోసం ఆడిషన్స్ ఇవ్వడానికి ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహించడమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఆసక్తి ఉన్నవారు తమ ఆడిషన్ క్లిప్‌లను మార్చి 15లోగా పంపాలి. “గం గం గణేశా” చిత్రంలో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.