Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికి తెల్సిందే. సినీ నటుడిగా, రాజకీయ నటుడుగా ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషన్. కానీ, పవన్ గా అందరికి తెల్సిన ఆయన కళ్యాణ్ బాబు గా చాలా తక్కువమందికి తెలుసు. మెగా ఫ్యామిలీలో మౌన మును ఎవరైనా ఉన్నారంటే అది పవన్ మాత్రమే. చిన్నతనం నుంచి ఆయన మనోగతాన్ని ఏనాడు ఎవరి ముందు బయటపెట్టింది లేదు. ఆయన ఆలోచనలు, అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఒకానొక సమయంలో ఆయన ఆ ఆలోచనల నుంచి బయటపడలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారట.. ఈ విషయాన్నీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మరోసారి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు. దీంతో మరోసారి ఈ వార్త నెట్టింట వైరల్ గా మారాయి.
Unstoppable 2 : పవన్ ప్రోమో వచ్చేసిందిరోయ్..
అసలు పవన్ ఆత్మహత్య చేసుకొనేలా ఏం ఆలోచించారు.. గత ఇంటర్వ్యూలో ఆయన ఆత్మహత్య విషయమై ఏం చెప్పారు అంటే.. ” చిన్నప్పటి నుంచి నాకుస్నేహితులు ఎక్కువగా ఉండేవారు కాదు. ఉన్న ఒకరిద్దరితో నా ఆలోచనలు సరిగ్గా కలిసేవి కావు. ఎనిమిదవ తరగతి నుండి పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అలవాటు ఉండటంతో.. ఇంటర్ ఫెయిల్ అయినా పెద్దగా బాధపడలేదు. స్నేహితులంతా జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారన నిస్పృహ ఎక్కువగా వెంటాడేది. ఇంట్లో ఎవరు ఏది అనేవారు కాదు.. కానీ, ఆ బాధ నాలోపల్ ఉండేది. ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో అన్నయ్య రూమ్ లో ఉన్న తుపాకీ తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అది చూసిన మా వదిన సురేఖ నన్ను ఆపి చాలా జాగ్రత్తగా చూసుకొంది. ఆ తరువాత అన్నయ్య నన్ను పిలిచి జీవితం గురించి చెప్పి.. నాకు ఇష్టమైన పనులు చేయమని చెప్పాడు” అని చెప్పుకొచ్చారు. చిన్నతనంలో ఒక చిన్న అపజయాన్ని కూడా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పవన్.. ఇప్పుడు జీవితం మొత్తం అపజయాలతోనే స్నేహం చేస్తున్నారు. కళ్యాణ్ బాబు నుంచి పవన్ కళ్యాణ్ గా.. పవర్ స్టార్ నుంచి జనసేనాని గా పవన్ మారిన విధానం మాత్రం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇక ఈ విషయం చెప్పడంతో ఈ ఎపిసోడ్ పై అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.