నారాయణన్ విజయరాజ్ అలగరస్వామీ… ఈ పేరు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ “పురచ్చి కలైంగర్ విజయకాంత్” అనగానే 80-90’స్ వాళ్లందరికీ ఒక సూపర్ స్టార్ హీరో గుర్తొస్తాడు. దాదాపు 150 సినిమాలకి పైగా నటించిన విజయకాంత్, తనకంటూ యాక్షన్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. 71 ఏళ్ల వయసులో అనారోగ్యం బారిన పడి కరోనా కారణంగా మరణించిన విజయకాంత్ ఐకానిక్ మూవీస్ లో టాప్ 10 మూవీస్ లిస్టు తీస్తే అందులో…
వీటితో పాటు మరెన్నో హిట్ సినిమాల్లో విజయకాంత్ నటించాడు. రజినీకాంత్, కమల్ హాసన్ ల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి స్టార్ హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా 1990-91ల్లో విజయకాంత్ చేసిన సినిమాలు ఆయన్ని మాస్ హీరోగా నిలబెట్టాయి. 2018లో ఆయన చివరగా నటించిన మధుర విరన్ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా చేసినా చేయకపోయినా, స్టార్ హీరో ఇమేజ్ చెదిరినా అలానే ఉన్నా విజయకాంత్ అభిమానులని వదలలేదు, అభిమానులూ విజయకాంత్ ని వదలలేదు.