Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి. అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ధనుష్ ఈసారి కెప్టెన్ మిల్లర్ ను సంక్రాంతి రేసులోకి దించుతున్నాడు. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందులో ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక పాన్ ఇండియా సినిమా కావడంతో.. ధనుష్ సినిమాను గ్రాండ్ గా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
RX 100 : మరోసారి రిపీట్ కానున్న ఆ సూపర్ హిట్ కాంబో..?
నవంబర్ 22 న కిల్లర్.. కిల్లర్ అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా సాంగ్ అప్డేట్ తో పాటు ధనుష్ న్యూ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ముఖానికి ఎర్ర కండువా కప్పుకొని.. చేతిలో తుపాకీ పట్టుకొని స్టూల్ పై కూర్చున్నాడు ధనుష్. ఇక ఆ కళ్లు చూస్తుంటేనే ధనుష్ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో కమ్యూనిస్ట్ గుర్తు కలర్ ను హైలైట్ చేయడంతో ఆ కళ్లు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్టర్ చూసిన అభిమానులు జింకను వేటాడే పులి కళ్లు ఎలా ఉంటాయో.. అలా ఉన్నాయి సామీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Captain Miller First single !
Heard you want that fight, well here’s a war.
I’ve tasted steel before, i have the scars.
You will learn to fear my name, your eyes will never see the same
KILLER KILLER CAPTAIN MILLER pic.twitter.com/2Wneu7EbhJ— Dhanush (@dhanushkraja) November 20, 2023