సంక్రాంతి సీజన్ లో ఎన్ని పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా ఒక చిన్న సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఏడాది ఒక చిన్న సినిమా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి సంక్రాంతి సీజన్ లో క్లీన్ హిట్ అవుతుంది. ఇదే కోవలో 2023 సంక్రాంతికి హిస్టరీని రిపీట్ చేస్తూ మేమూ హిట్ కొడతాం అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ‘కళ్యాణం కమనీయం’ చిత్ర యూనిట్. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీలో సంతోష్ శోభన్ హీరోగా నటించగా, తమిళమ్మాయి ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. క్లీన్ ‘U’ సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. చిరు, బాలయ్యలు వచ్చిన తర్వాత జనవరి 14న వస్తున్న కళ్యాణం కమనీయం సినిమాకి ప్రభాస్ ఫాన్స్ సపోర్ట్ ఉంది. సినిమా బాగుంటే ప్రతి సినీ అభిమాని ఏ మూవీనైనా ఆదరిస్తాడు కాబట్టి కళ్యాణం కమనీయం సినిమా కంటెంట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇదిలా ఉంటే జనవరి 14 టాలీవుడ్ కి బాగా కలిసొచ్చిన రోజు, ఈ డేట్ కి రిలీజ్ అయ్యి మెమొరబుల్ హిట్స్ గా నిలిచిన సినిమాలు చాలానే ఉన్నాయి.
ముందుగా 2002లో తరుణ్ ‘నువ్వు లేక నేను లేను’ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత 2004లో ప్రభాస్, అప్పటి స్టార్ హీరోలతో పోటీ పడుతూ ‘వర్షం’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. అప్పుడు కూడా సంక్రాంతి చిరు, బాలయ్యల మధ్య భారి బాక్సాఫీస్ ఫైట్ జరిగింది. 2005లో సిద్ధార్థ్ నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా సూపర్ హిట్ అయ్యి ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజుని సంక్రాంతి రాజుగా మార్చింది. 2006లో లక్ష్మీ, 2011లో గోల్కొండ హై స్కూల్, 2012 బాడీ గార్డ్, 2016లో ఎక్స్ ప్రెస్ రాజా, 2017లో శతమానం భవతి సినిమాలు జనవరి 14న రిలీజ్ అయ్యి సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ సినిమాలు హిట్ అయిన ప్రతి సారి స్టార్ హీరోల సినిమాలు కూడా రేసులో ఉండడం విశేషం. ఇప్పుడు కూడా సంక్రాంతికి చిరు, బాలయ్యల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగుతోంది. ఈ వార్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ‘కళ్యాణం కమనీయం’ పెద్ద హిట్ అవుతుందేమో చూడాలి.