‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు, ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని రూపొందించాడు హరీష్ శంకర్. ఈ మూవీ వచ్చిన దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ తన ఫ్యాన్ బాయ్ తో సినిమా చేస్తున్నాడు. సాహో డైరెక్టర్ సుజిత్, పవన్ కళ్యాణ్ ని డై హార్డ్ ఫాన్. ఈ హీరో, డైరెక్టర్ కాంబినేషన్ ని సెట్ చేసి, ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసింది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్. కేవలం అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే సుజిత్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కిక్ ఇచ్చాడు. దశాబ్దం క్రితం హరీష్ శంకర్ చేసిన మ్యాజిక్ ని, ఇప్పుడు సుజిత్ చేస్తాడంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేసింది రీమేక్ సినిమా, ఆల్రెడీ ఉన్న కథకి పవన్ కళ్యాణ్ స్టైల్ ని యాడ్ చేసి హరీష్ శంకర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు సుజిత్, హరీష్ శంకర్ లా రీమేక్ చెయ్యట్లేదు. తను సొంత కథతో సినిమా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ని ది ఒరిజినల్ గాడ్ అంటూ ఎలివేషన్స్ ఇస్తున్నాడు. కోలీవుడ్ లో ఇలాంటి సంభవం ఒకటి జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేసే అవకాశం అతని ఫ్యాన్ అయిన ‘కార్తీక్ సుబ్బరాజ్’కి దక్కింది. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమానే ‘పేట’. రజినీకాంత్ ఫాన్స్ కి వింటేజ్ వైబ్రేషన్స్ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్, రజినీని అద్భుతంగా చూపించాడు. రజినీ ఎలా ఉంటే ఫాన్స్ కి నచ్చుతాడో, రజినీ నుంచి ఫాన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో తెలిసిన కార్తీక్ సుబ్బరాజ్ ‘పేట’ సినిమాని అలానే తెరకెక్కించాడు. కార్తీక్ సుబ్బరాజ్, రజినీకాంత్ ని చూపించిన రేంజులో, సుజిత్ పవన్ కళ్యాణ్ ని చూపిస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది.