మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. బ్లాక్ పాంథర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. జూలై 9, 2021న విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమాతో మొదలైన MCU ఫేజ్ 4లో సాంగ్ ఛీ, ఎటర్నల్స్, స్పైడర్ మ్యాన్ నో వే హోం, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, థార్ లవ్ అండ్ థండర్ సినిమాలు వచ్చాయి. ఇక చివరి సినిమాగా వచ్చిన ‘వకాండా ఫరెవర్’ సూపర్ హిట్ టాక్ తో 850 మిలియన్ డాలర్స్ ని రాబట్టి, ఫేజ్ 4కి గ్రాండ్ క్లోజింగ్ ఇచ్చింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ మార్కెట్ ఆశించిన స్థాయిలో జరగలేదు, ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా సోసో గానే ఆడింది. ఇలాంటి సమయంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మళ్లీ పుంజుకోవాలి అంటే ఫేజ్ 5లో అద్భుతాలు జరగాలి. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే ఇప్పుడు మార్వెల్ లవర్స్ దృష్టి ఇప్పుడు ఫేజ్ 5 పైన పడింది.
2023 నుంచి 2024 మిడ్ వరకూ మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలు ఫేజ్ 5 కిందకి వస్తాయి. ఈ ఫేజ్ 5లో మొదటి సినిమాగా ‘ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటూమేనియ'(Ant-Man and the Wasp: Quantumania) 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఆ తర్వాత సమ్మర్ లో ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3′(Guardians of the Galaxy Vol. 3) మే 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఆ వెంటనే రెండు నెలలు కూడా తిరగకుండానే జూలై 28న ‘ది మార్వెల్స్'(The Marvels) రిలీజ్ అవనుంది. ఈ సినిమా రిలీజ్ అయిన పది నెలల వరకూ మార్వెల్ యూనివర్స్ నుంచి మరో సినిమా లేదు. మళ్లీ 2024 మే 3న ‘కెప్టన్ అమెరికా: న్యూ వరల్డ్ ఆర్డర్'(Captain America: New World Order), జూలై 26న ‘థండర్ బోల్ట్స్'(Thunderbolts) రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఫేజ్ 5కి ఎండ్ కార్డ్ వేస్తూ సెప్టెంబర్ 6న ‘బ్లేడ్'(Blade) సినిమా విడుదల కానుంది. ఇక్కడితో మార్వెల్ ఫేజ్ 5 కంప్లీట్ అవ్వనుంది. సినిమాలే కాదు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5లో ‘వాట్ ఇఫ్ సీజన్ 2’, ‘సీక్రెట్ ఇన్వాషణ్’, ‘ఎకో’, ‘లోకీ సీజన్ 2’, ‘ఐరన్ హార్ట్’, అగథా:కొవెన్ ఆఫ్ ఛావోస్’, డేర్ డెవిల్: బోర్న్ అగైన్’ లాంటి సీరీస్ లు కూడా ఆడియన్స్ ని అలరించడానికి రిలీజ్ అవనున్నాయి. ఈ ఫేజ్ 5లో… ‘ది మార్వెల్స్’, ‘కెప్టెన్ అమెరికా: న్యూ వరల్డ్ ఆర్డర్’ సినిమాలపై సినీ అభిమానుల్లో హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆ అంచనాలని మార్వెల్ మేకర్స్ అందుకోని, బాక్సాఫీస్ దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.