C. S. R. Anjaneyulu: విలక్షణ వాచకంతో అలరించిన సీఎస్సార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే అంతగా ఎవరికీ తెలియదు కానీ, షార్ట్ గా ‘సీఎస్సార్’ అనగానే చప్పున గుర్తు పట్టేస్తారు జనం. తనదైన వాచకాభినయంతో అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రల్లో ఎంతగానో ఆకట్టుకున్నారు. నటరత్న యన్టీఆర్ కు ముందు తెలుగునాట శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారు. ఆ పై ప్రతినాయకునిగా, గుణచిత్ర నటునిగా హాస్యం పలికిస్తూ సాగిపోయారాయన.
సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 1907 జూలై 11న మచిలీపట్నంలోని చిలకలపూడిలో జన్మించారు. స్కూల్ చదువు కాగానే, పై చదువులకు పోకుండా సీఎస్సార్ నాటకరంగాన్ని ఎంచుకున్నారు. రంగస్థలంపై తనదైన బాణీ పలికించిన సీఎస్సార్ ను ‘రామపాదుకా పట్టాభిషేకం’లో ఎంపిక చేశారు. అందులో శ్రీరామునిగా యడవల్లి సూర్యనారాయణ నటించగా, ఆయన సోదరునిగా సీఎస్సార్ అభినయించారు. తరువాత ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’లో శ్రీకృష్ణునిగా నటించి ఆకట్టుకున్నారు సీఎస్సార్. ‘తుకారామ్’లో తుకారామ్ గా, ‘జయప్రద’లో పురూరవ చక్రవర్తిగా, ‘బాలాజీ’లో శ్రీనివాసునిగా, ‘పాదుకాపట్టాభిషేకం’లో శ్రీరామునిగా నటించి జనాన్ని మురిపించారు సీఎస్సార్. అయితే నలభై ఏళ్ళు దాటగానే కేరెక్టర్ రోల్స్ లోకి పరకాయ ప్రవేశం చేయసాగారాయన. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’లో రాజుగా సీఎస్సార్ అభినయం ఎంతగానో అలరించింది. ఆపై “పెళ్ళి చేసి చూడు, దేవదాసు, చరణదాసి, కన్యాశుల్కం, రోజులు మారాయి. భాగ్యరేఖ, అప్పు చేసి పప్పుకూడు, ఇల్లరికం, భీష్మ, సవతికొడుకు, ఇరుగు పొరుగు” వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అన్నిటినీ మించి ‘మాయాబజార్’లో శకునిగా ఆయన విలక్షణమైన అభినయాన్ని ప్రదర్శించారు. ఆ పాత్ర ఈ నాటికీ జనాన్ని అలరిస్తూనే ఉండడం విశేషం! ఇంతలా అలరించిన సీఎస్సార్ 1963 అక్టోబర్ 8న కన్నుమూశారు. సీఎస్సార్ ను అనుకరిస్తూ, ఆయన వాచకాన్ని ఒడిసిపట్టి పలువురు నటులు సాగారు. కానీ, ఎవరూ ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేక పోవడం గమనార్హం!
Also Read
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!