Allu Arjun: అల్లు అర్జున్ గారాల పట్టీ.. అల్లు కుటుంబానికి యువరాణి ఆలు అర్హ గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు. అల్లు అర్హ అందగత్తె కాదు చాలా తెలివైందని తాత అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పి తెగ మురిసిపోయారు. ఇక అర్హ గురించి బన్నీని చెప్పమంటే.. మాటలు సరిపోవు అని చెప్పేస్తాడు. కూతురే బన్నీ ప్రపంచం. ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా కూతురితో ఆడుకోకుండా మాత్రం నిద్రపోడట బన్నీ. ఇక ఈ అందాల క్యూటీ పై పుట్టినరోజు ఈరోజు. దీంతో మరోసారి కూతురు క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్పెషల్ విషెస్ తెలిపాడు. ” నా జీవితంలో క్యూటెస్ట్ పర్సన్ కు హ్యాపీ బర్త్ డే’ అని చెప్పుకొచ్చాడు.
చిన్నప్పటి నుంచి అర్హ- బన్నీ క్యూట్ సంభాషణలు వైరల్ గా మారిన విషయం తెల్సిందే. తండ్రి వేసిన స్టెప్ ను దోశ స్టెప్ అని అర్హ అనడం, తండ్రి చెప్పిన వాడిని పెళ్లి చేసుకోను అని గోల చేయడం, దొండకాయ్ బెండకాయ్ నువ్వు నా గుండెకాయ్ అని తండ్రిపై ప్రేమ చూపించడం లాంటి వీడియోలను ఇదివరకే చూసాం. ఇక తాజాగా తండ్రికి, అర్హ కందిరీగ కథ చెప్పుకొచ్చింది. తమ బిల్డింగ్ కింద కందిరీగలు ఉన్నాయని బన్నీకి చెప్తూ.. అతడిని తీసుకెళ్లి చూపించడానికి ప్రయత్నం చేస్తోంది. అవంటే తనకు భయమని చెప్పడం, అందుకు బన్నీ భయమెందుకు అని దైర్యం చెప్పడం చూస్తే.. తండ్రికూతుళ్ళ మధ్య ఉన్న ప్రేమ కనిపిస్తోంది. మరి ముఖ్యంగా అర్హ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు అయితే ఎవరైనా ఫిదా కాకుండా ఉండలేరు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Happy Birthday to the cuteness of my life . #alluarha #కందిరీగకథలు 😂 pic.twitter.com/83hQt0iKMn
— Allu Arjun (@alluarjun) November 21, 2022