BSS10: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గతేడాది ఛత్రపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కన్నా ముందు స్టూవర్టుపురం దొంగ అనే సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. కానీ, ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక కొంత గ్యాప్ తీసుకున్నాకా తన 10 వ చిత్రాన్ని ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ కు దర్శకత్వం వహించిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ డీఎస్పీగా ఛార్జ్ తీసుకుంటున్నట్లు ఉన్న ఒక లెటర్ ను రిలీజ్ చేస్తూ ప్రజాహితముకై జారీ చేయడమైనది.. అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాపై అభిమానులు బాగానే అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో బెల్లంకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.