BSS10: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గతేడాది ఛత్రపతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఛత్రపతి సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కన్నా ముందు స్టూవర్టుపురం దొంగ అనే సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.