సినిమా రిలీజ్‌కు సరిగ్గా ఆరు రోజుల ముందు బ్రో టైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు టీజర్, రెండు సాంగ్స్‌తోనే సరిపెట్టిన మేకర్స్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రెడీ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి అంటూ.. ట్రైలర్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 22న బ్రో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఈ సందర్భంగా.. అందరూ ఎదురుచూస్తున్న మాస్ సెలెబ్రేషన్ వచ్చేస్తోందంటూ పేర్కొంది. దీంతో ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది పవర్ స్టార్ ఆర్మీ. వైజాగ్, హైదరాబాద్‌లలో ఒకేసారి గ్రాండ్‌గా ఫ్యాన్స్ సమక్షంలో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌తో బ్రో సినిమా పై మరింత హైప్ రానుంది. ఇక ఆ తర్వాత 25న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
Read Also: Hebah Patel : ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న హెబా పటేల్..
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిలో ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ కేతిక శర్మ, డైరెక్టర్ సముద్రఖని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే పవన్ పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉండడంతో.. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రమే రానున్నారు. అదొక్కటి చాలు.. బ్రో సినిమాకు ఊహించిన బజ్ తీసుకురావడానికి అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు.. థమన్ సంగీతం అందించాడు. జూలై 28న బ్రో మూవీ థియేటర్లోకి రానుంది.