Bro Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. తమిళ్ స్టార్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా.. త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నేడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దేవుడుగా పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. మార్క్ అలియాస్ మార్కండేయగా తేజ్ కనిపించగా.. అతనికి జోడిగా కేతిక శర్మ నటించింది.
“భస్మాసురుడు అనేవాడు ఒకడు ఉండేవాడు తెలుసా.. మీ మనుషులు అందరు వాడి వారసులు.. ఎవడి తలమీద వాడే పెట్టుకుంటాడు.. ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వడు” అని పవన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. రోబోలా టైమ్ లేదు.. టైమ్ లేదు అంటూ కుటుంబాన్ని, స్నేహితులను, ప్రేమించిన అమ్మాయిని వదిలేసి.. జీవితంలో పరుగులు పెడుతూ ఉంటాడు మార్క్. ఇక అతనికి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే.. అతనికి కాలం విలువ తెలియడం కోసం టైమ్ దిగివస్తాడు. ఆ టైమే పవన్ కళ్యాణ్.. తాను లేకపోతే తన కుటుంబం ఏమైపోతుందో.. అని దేవుడ్ని బతిమిలాడి మళ్లీ అతనితోపాటే కిందకు వచ్చిన మార్క్.. తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం అదే టైమ్ ను వరంగా అడగడం.. ఆ టైమ్ లోనే మార్క్ జీవితాన్ని తెలుసుకోవడం లాంటివి చూపించారు. నిజం చెప్పాలంటే.. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరిని మార్క్ రిప్రజెంట్ చేస్తాడు. ఇక పవన్- తేజ్ కాంబో అదిరిపోయింది. వివిధ గెటప్ లో పవన్ కనిపించిన తీరు ఆకట్టుకొంటుంది. మార్క్ కు కాలం విలువ తెలిసేలా చెప్పిన ప్రతి డైలాగ్ ఆకట్టుకొంటుంది. ఇక తేజ్.. యాక్సిడెంట్ అయిన తరువాత వస్తున్నా సినిమా కాబట్టి .. చాలా చోట్ల తేజ్ రియల్ గా ఆ బాధను అనుభవించిన ఫీల్ తెలుస్తోంది. ఇక థమన్ నేపధ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. మరి ఈ సినిమాతో మామఅల్లుళ్లు ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.