రౌడీ బాయ్స్ ‘బృందావనం’లో అనుపమ… మార్మోగుతున్న డిఎస్పీ మాస్ బీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆశిష్ రెడ్డి నటించిన తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘బృందావనం’ అనే మూడవ సింగిల్ విడుదలైంది. కాలేజీ కల్చరల్ ఈవెంట్లో రద్దీగా ఉండే వేదికపై అనుపమ ఈ పాట కోసం డ్యాన్స్ చేసినట్టు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. అనుపమ తన అందమైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీతం విషయానికి వస్తే… దేవి శ్రీ ప్రసాద్ మరోసారి మాస్ పెప్పీ నంబర్‌ను విడుదల చేశాడు. ఈ సాంగ్ యూత్ లో ఖచ్చితంగా ఉత్సాహాన్ని మరింతగా పెంచుతుంది. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం, మంగ్లీ మనోహరమైన వాయిస్ సాంగ్ లో హైలెట్.
Read Also : బాలయ్య సినిమాలో శాండల్ వుడ్ సెన్సేషన్… పవర్ ఫుల్ రోల్
Also Read
‘రౌడీ బాయ్స్’ మేకర్స్ సినిమా జనవరి 14 లేదా 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు పండుగలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య మ్యూజిక్‌తో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ‘రౌడీ బాయ్స్’లో ఆశిష్, అనుపమ మధ్య కెమిస్ట్రీ మరో హైలైట్‌గా ఉండబోతోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు మధి కెమెరా వర్క్, మధు ఎడిటింగ్ అందించారు.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!