బాలయ్య సినిమాలో శాండల్ వుడ్ సెన్సేషన్… పవర్ ఫుల్ రోల్

ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్టుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రం సెట్స్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతిహాసన్ బాలయ్యతో జత కట్టబోతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబందించిన ఆసక్తికర విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడిని భాగం చేయబోతున్నారు మేకర్స్.

Read Also : డైరెక్టర్ కి బాలయ్య వార్నింగ్… 6 నెలలు ఆ హీరోను కలవొద్దు !

పాపులర్ కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రాల్లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. బాలయ్యతో పోటాపోటీగా ఫైట్ చేయడానికి సెట్స్ లోకి ఈ నటుడు రాబోతున్నాడని అధికారికంగా ప్రకటించారు. దునియా విజయ్ తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఇప్పటికే దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాలో నుంచి ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను లీక్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

Related Articles

Latest Articles