ఆశిష్ రెడ్డి నటించిన తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుండి ‘బృందావనం’ అనే మూడవ సింగిల్ విడుదలైంది. కాలేజీ కల్చరల్ ఈవెంట్‌లో రద్దీగా ఉండే వేదికపై అనుపమ ఈ పాట కోసం డ్యాన్స్ చేసినట్టు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. అనుపమ తన అందమైన స్టెప్పులతో అందరి దృష్టిని ఆకర్షించింది. సంగీతం విషయానికి వస్తే… దేవి శ్రీ ప్రసాద్ మరోసారి…