Arjun Kapoor: ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే. స్టార్ హీరోల సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్, హీరో అర్జున్ కపూర్ నోరు విప్పాడు. వీటివలనే హిందీ చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన అర్జున్ మాట్లాడుతూ “ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది.. ఇప్పటివరకు దీనిపై మేము మాట్లాడకుండా తప్పుచేసాం. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే బాలీవుడ్ మనుగడ కోల్పోతోంది. మన ట్యాలెంట్ ను మన సినిమానే చూపిస్తుంది అని నమ్మడం వలనే మేము సైలెంట్ గా ఉన్నాం.
మా సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు. ఈ విషయంపై ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ఇకపై వీటిపై దృష్టి పెట్టేలా స్టార్లు అందరు ఏకంగా పోరాటం చేయాలి. ఇలాంటి ట్రెండ్స్ సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అర్జున్ కపూర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అర్జున్ కపూర్ ను సపోర్ట్ చేయడానికి ఏఏ హీరోలు ముందుకు వస్తారో చూడాలి. ఇక అర్జున్ కపూర్ కెరీర్ విషయానికి వస్తే ఇటీవలే ఏక్ విలన్ రిటర్న్స్ లో అర్జున్ కపూర్ నటించాడు. త్వరలోనే మరోకొత్త ప్రాజెక్ట్ లో నటించనున్నాడు.