అయ్యప్ప దీక్షకు సౌత్ లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇటీవల కాలంలో అయ్యప్ప మాలను ధరించే వారి సంఖ్య కూడా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ ఏడాది అయ్యప్ప మాలను ధరించారు. సౌత్ లో ఉన్న జనాలకు, అలాగే ఇక్కడి సూపర్ స్టార్లకు అయ్యప్ప మాల అనేది మామూలు విషయమే. ఆయ్యప్పను ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు 41 రోజుల పాటు చేపట్టే ఈ దీక్ష చివరగా కేరళలో ఉన్న శబరిమల దేవస్థానంలో దేవుడిని దర్శించుకున్న తరువాత ముగుస్తుంది. ఇప్పటి వరకూ సౌత్ కే పరిమితమైన అయ్యప్ప మహిమ ఇప్పుడు బాలీవుడ్ లోనూ కన్పిస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యప్ప మాలను ధరించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు.
Read Also : ‘ఆంధ్రావాలా’ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించిన తారక్
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తాజాగా అయ్యప్ప మాలను ధరించారు. మరో విశేషం ఏమిటంటే ఆయన అయ్యప్ప మాలను ధరించడానికి మన సౌత్ జ్యోతిష్యుడు బాలు మున్నంగి కారణం కాగా… గురుస్వామి వెంకటరెడ్డి అనే ఆయన స్వయంగా ముంబై వెళ్ళి, అక్కడ ఉన్న అజయ్ దేవగణ్ ఇంట్లో అయ్యప్ప మాలధారణను చేయించారు. బహుశా బాలీవుడ్ లో అయ్యప్ప మాల వేసిన మొట్టమొదటి స్టార్ అజయ్ దేవగణ్ అయ్యి ఉండొచ్చు. ఇక హిందూ విశ్వాసాల ప్రకారం అయ్యప్ప మాలను ధరిస్తే ఆయన మహిమ కారణంగా కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. తాజాగా అజయ్ దేవగణ్ అయ్యప్ప దీక్షకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.