‘ఆంధ్రావాలా’ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించిన తారక్

జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అంటే పడిచచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకునే పనిలో ఉన్నారు తారక్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నట్టు వెల్లడైంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా పలు బిటౌన్ పాపులర్ షోలలో పాల్గొన్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్న ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

తన 2004 చిత్రం ఆంధ్రావాలా ఆడియో లాంచ్‌కు సుమారు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారని తెలిపారు. పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, దాని పర్యవసానంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూసివేయడం వల్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమ చిత్రం విడుదల వాయిదా పడినట్లు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. అయితే దీనికి ముందు చిత్రనిర్మాత రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ఈ కల్పిత పీరియాడికల్ డ్రామాను బాగా ప్రమోట్ చేశారు. అదే కారణంతో వారు కపిల్ శర్మ షో వేదికపై కూడా కన్పించారు. ఈ ఎపిసోడ్ నిన్న రాత్రి టెలివిజన్‌లో ప్రసారమైంది.

Read Also : పిక్ : మాల్దీవుల్లో మెర్మైడ్… మెస్మరైజ్ చేస్తున్న దిశా

ఈ షో ఇంటరాక్షన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్‌లకు భారీ సంఖ్యలో అభిమానులు ఎలా వస్తారో హోస్ట్ కపిల్ శర్మ ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ 2004 చిత్రం ‘ఆంధ్రావాలా’ ఆడియో లాంచ్‌కు వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఎలా చేసిందో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానుల సంఖ్య గురించి తారక్ ని అడిగినప్పుడు, సినిమా ఆడియో లాంచ్‌కు దాదాపు 9 నుండి 10 లక్షల మంది అభిమానులు వచ్చారని, దాని కోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. దీని గురించి తెలుసుకున్న అలియా భట్ అవాక్కయ్యారు.

2004లో వచ్చిన “ఆంధ్రావాలా” చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. జూనియర్ ఎన్టీఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు.

Related Articles

Latest Articles