Bollywood Director Actor Satish Kaushik Passes Away: బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్ (66) ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయాన్ని ట్విటర్ మాధ్యమంగా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ధృవీకరించారు. 45 ఏళ్లుగా సాగుతున్న తమ స్నేహం.. ఈరోజుతో ముగిసిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఈ ప్రపంచంలో మరణం అనేది అంతిమం అని నాకు తెలుసు. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ సతీష్ గురించి ఇలా రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మా 45 ఏళ్ల స్నేహబంధం నేటితో ముగిసింది. నువ్వు లేని జీవితం, ఇక నుంచి మునుపటిలా ఉండదు మిత్రమా’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు ఇతర సినీ ప్రముఖులు సతీష్ కౌశిక్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
AP Health Department: వైరల్ ఫీవర్స్, వడదెబ్బపై అప్రమత్తం.. జూమ్ ద్వారా మంత్రి రజిని సమీక్ష
కాగా.. 1956 ఏప్రిల్ 13వ తేదీన సతీష్ కౌశిక్ జన్మించారు. 1983లో ‘మాసూమ్’ సినిమాతో నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. 1993లో బోనీ కపూర్ నిర్మాణంలో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా రూపొందిన ‘రూప్ కీ రాణి.. చోరోంకా రాజా’ చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తారు. తేరే నామ్, వాదా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. హిందీ చిత్రసీమలో 100పైగా సినిమాల్లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. ముఖ్యంగా.. ఆయన కామెడీ టైమింగ్‌కు మంచి పేరుంది. ‘మిస్టర్ ఇండియా’లో ఆయన చేసిన కాలెండర్ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరిగిపోలేదు. అనిల్ కపూర్, గోవిందాలతో ఆయనది సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరితో చేసిన ‘సాజన్ చలే ససురాల్, దీవానా మస్తానా’ వంటి చిత్రాల్లో.. ఆయన కామెడీని ఎవ్వరూ మర్చిపోలేరు. 1990లో రామ్ లఖన్, 1997లో సాజన్ చలే ససురాల్ సినిమాలకు గాను ఉత్తమ హాస్యనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు.
Karnataka: బొట్టుపెట్టుకోలేదని మహిళను తిట్టిన బీజేపీ ఎంపీ.. మహిళా దినోత్సవం రోజే అవమానం