Kanishka Soni: శృంగారానికి మగాడు అక్కర్లేదట.. తనను తానే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanishka Soni: ప్రముఖ బాలీవుడ్ నటి కనిష్క సోనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవిత్ర రిష్తా, దియా ఔర్ బాతి హమ్ లాంటి టీవీ షోలతో పాపులర్ నటిగా పేరు సంపాదించిన కనిష్క సోనీ తనను తానే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను అభిమానులకు షేర్ చేసింది. ఈ మేరకు సదరు ఫోటోలో ఆమె మెడలో తాళిబొట్టు, నుదుటున సిందూరం కనిపిస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందాయని.. కానీ ఈరోజుల్లో శృంగారం చేయాలంటే ఆడవాళ్లకు పురుషులు అవసరం లేదని భావిస్తున్నానని కనిష్క సోనీ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమెను నెటిజన్‌లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. జీవితంలో మగాడి తోడు లేకుండా ఎలా బతుకుతావంటూ నిలదీస్తున్నారు.
Read Also: Chiranjeevi Hospital: సినీ కార్మికుల కోసం కొణిదెల ఆస్పత్రి.. ఛారిటీ కోసం తమన్ మ్యూజిక్ ఈవెంట్
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
కాగా తాను గుజరాత్‌కు చెందిన సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని.. తనకు పెళ్లి చేసుకోవాలని ఎంతో కోరికగా ఉందని.. అయితే మాట మీద నిలబడే పురుషులను తన జీవితంలో చూడలేదని.. అందుకే పురుషుడు లేకుండానే తన జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు కనిష్క సోనీ వివరించింది. తన కలలు, అవసరాలను సొంతంగా తానే తీర్చుకోగలనని వ్యాఖ్యానించింది. మహాబలి హనుమాన్ వంటి టీవీ షోలో దేవి పాత్రను పోషించినా తనను ఎవరూ పట్టించుకోలేదని.. కానీ ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంతోమంది తనకు ఫాలోవర్లు ఉన్నారని తెలిపింది. ఇప్పుడున్న సమాజంలో వివాహం చేసుకున్న మహిళల్లో 90 శాతం మంది సంతోషంగా లేరని.. అలాంటప్పుడు తాను మగాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. ప్రజలు ఏమనుకుంటారో అని సందేహించి గతంలో ఐటం సాంగ్‌లలో అవకాశాలను సైతం వదులుకున్నట్లు కనిష్క సోనీ వెల్లడించింది. ప్రజలను తానెప్పుడూ ఇబ్బంది పెట్టలేదని.. అయినా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొంతమంది జోక్యం చేసుకోవడం తనకు నచ్చలేదని తెలిపింది. తనను తాను ప్రేమించడం తప్పేమీ కాదని తన అభిప్రాయంగా పేర్కొంది.
తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!