Chiranjeevi Hospital: సినీ కార్మికుల కోసం కొణిదెల ఆస్పత్రి.. ఛారిటీ కోసం తమన్ మ్యూజిక్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi Hospital: శుక్రవారం రాత్రి జరిగిన క్రికెట్ కార్నివాల్ ఈవెంట్, జెర్సీ లాంచింగ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రిని వచ్చే ఏడాది తన పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించే శక్తి తనకు ఉందని.. అయితే టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ముందుకు వచ్చి రూ.20లక్షలు విరాళంగా ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయమని చిరంజీవి అన్నారు. పెద్దాసుపత్రులకు వెళ్లలేని సినీ కార్మికులకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చిత్రపురి కాలనీలో ఉండే సినీ కార్మికులతో పాటు బీపీఎల్ (బిలో పావర్టీ లైన్) లోపు ఉన్న వారికి, రోజు కూలీ చేసే కార్మికులకు ఉపయోగపడేలా ఈ ఆస్పత్రి ఉంటుందన్నారు.
ఈరోజు తాము లక్షల్లో సంపాదిస్తున్నామంటే కారణం సినీ పరిశ్రమేనని చిరంజీవి అన్నారు. అలాంటి పరిశ్రమకు ఎంతో కొంత మనం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే.. ఎవరైనా భాగస్వామ్యులు అవుతానన్నా సరే.. సంతోషంగా వారికి కూడా ఈ ఆనందం, అనుభూతి అందిస్తానని మెగాస్టార్ చెప్పారు. అటు ఈ ఆస్పత్రి ఛారిటీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ముందుకు వచ్చాడు. తన వంతుగా మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించి ఫండ్స్ కలెక్ట్ చేస్తానని తమన్ చెప్పాడు. దీంతో తమన్‌ను చిరంజీవి అభినందించారు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
SS Thaman do a musical event as a charity for konidela venkatra rao hospital at chitrapuri 🙏👏👏 #Chiranjeevi #RamCharan𓃵 #PawanKalyan #GodFather pic.twitter.com/WkmFgPKG8E
— NEXT CM @PawanKalyan 👑 Any Doubt (@PRDPRDDY6) August 19, 2022
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!