Nishi Singh: చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులతో పాటు ఇండస్ట్రీని ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈ నెలలో వరుస విషాదాలు.. సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు.. ఆయన మృతి తరువాత బాలీవుడ్, కోలీవుడ్ లో ముగ్గురు సీనియర్ నటులు మృతి చెందారు. ఇక నిన్నటికి నిన్న యువనటి దీప ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఈ వరుస విషాదాలను మరువకముందే.. బాలీవుడ్ సీనియర్ టీవీ నటి నిషి సింగ్ కన్నుమూశారు.
గత మూడేళ్ళుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయస్సు 50.. మూడు రోజుల ముందే ఆమె తన పుట్టినరోజును ఘనంగా జరుపుకొని 50 వ పడిలోకి అడుగుపెట్టింది. ఈలోపే ఈ విషాదం చోటుచేసుకున్నదని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. “ఆమె గొంతులో ఇన్ఫెక్షన్ ఉంది. నోటి మాట లేదు.. అయినా పుట్టినరోజున ఆమె ఎంతో ఆనందంగా కనిపించింది. కూతురు, కొడుకుతో ఆడుకొంది. దగ్గర ఉండి వారే నిషితో కేక్ కట్ చేయించారు” అని నిషి భర్త సంజయ్ సింగ్ తెలిపాడు. ఇక నిషి .. ఖాబుల్ హై, ఇష్క్ బాజ్ లాంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.