బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. ముంబై జుహాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ జాతీయ మీడియాతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 61 ఏళ్ల గోవిందా మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, వెంటనే కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆయనను ఆస్పత్రిలో చేర్చగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.
Also Read : Kaantha : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ పై ఎం.కె.టి కుటుంబం ఫిర్యాదు..
990లలో బాలీవుడ్‌లో అత్యధిక హిట్స్ అందించిన హీరోల్లో గోవిందా ఒకరు. కామెడీ, డ్యాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన గోవిందా, గత కొంతకాలంగా సినిమాల నుంచి కొంచెం దూరంగా ఉన్నా, రియాలిటీ షోలు, పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరగానే ఉన్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో వచ్చిన ఈ వార్తతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. తిరిగి తెరపై కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.