ఈ మధ్య రిలీజ్ అవుతున్న మలయాళ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రేమలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మొన్న వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అదే విధంగా నిన్న రిలీజ్ అయిన ఆవేశం సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మంచి హిట్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తన సొంతం చేసుకుంది. అయితే, ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి విడుదల కాబోతుంది..
2006 లో తమిళనాడులో జరిగిన యాదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది.. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా రూ.200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది.. ఇప్పటికి కలెక్షన్స్ తగ్గలేదు. ఈ వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.. ఇప్పటికి ఈ సినిమా ట్రెండింగ్ లో ఉందంటే మామూలు విషయం కాదు.. ఇక ఓటీటీలో ఈ త్వరలో స్ట్రీమింగ్ కానుంది..
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ని ఈ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఈ చిత్రాన్ని మే 5న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు.. ఈ అనౌన్స్మెంట్ చేస్తూ మరి ఓటీటీ సంస్థ టీజర్ ను రిలీజ్ చేసింది.. ప్రస్తుతం ఆ టీజర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
But do you know why it’s called “Devil’s Kitchen”? 👀
Don’t miss the #ManjummelBoys in action, streaming from May 5, only on #DisneyPlusHotstar!
Watch in Hindi, Malayalam, Tamil, Telugu & Kannada.#ManjummelBoysOnHotstar pic.twitter.com/keE7WpRH1X
— Disney+ Hotstar (@DisneyPlusHS) April 27, 2024