మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్ మరియు భాగ్యశ్రీ బోర్సేల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన రాగా మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు.
Also Read : Complete Star : నెల గ్యాప్ లో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన మెహన్ లాల్
తమిళ్ తో పాటు తెలుగులోను నటుడుగా అలాగే దర్శకుడిగా ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సముద్రఖని. కాంతా సినిమాలో సముద్రఖని ఓ పవర్ఫుల్ కనిపించబోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర బృందం ఈరోజు అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. అద్భుతమైన మోనోక్రోమ్ ప్యాలెట్‌లో ప్రదర్శించబడిన ఈ పోస్టర్‌లో సముద్రఖని భయంకరమైన అవతార్‌లో దర్శనమిచ్చాడు. కళ్ళజోడు ధరించి, గళ్ళ చొక్కా వేసుకుని ఇంటెన్సివ్ లుక్ లో ఉన్నాడు సముద్రఖని. చూస్తుంటే కాంతా లో సముద్ర పాత్ర కథనంలో కీలకమైన పాత్రను పోషిస్తుందని సూచిస్తుంది. 1950ల మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్ గా తెరపైకెక్కుతున్న కాంత ఖచ్చితంగా ప్రేక్షకులను ఆ యుగం యొక్క ఆత్మలోకి తీసుకెళుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయి, పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్ , దుల్కర్ సొంత ప్రొడక్షన్ వేఫారెర్ బ్యానర్స్ పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో తీసుకురానున్నారు.