లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఫీల్ గుడ్ మూవీ తో హీరోగా లాంచ్ అయిన అభిజిత్ తర్వాత ఎందుకో సరైన సినిమాలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. ఆ తర్వాత ఆయన చేసిన రామ్ లీలా, మిర్చి లాంటి కుర్రాడు లాంటి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఆయన ఓటీటీ అంతగా ఫేమస్ అవ్వకముందే పెళ్లి గోల అనే ఒక వెబ్ సిరీస్ చేశాడు. కంటెంట్ బాగానే ఉన్నా ప్రేక్షకులకు అది కూడా ఎక్కువగా రీచ్ అవలేదు. అయితే 2020లో బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొని కప్ గెలవడమే కాక అనేక మంది ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ కంటెస్తెంట్ అయిపోయాడు. అయితే బిగ్ బాస్ కప్పు గెలిచిన తర్వాత ఎందుకో ఆయన సినిమాలు కానీ వెబ్ సిరీస్ గాని చేయడానికి ఆసక్తి చూపించలేదు.
Also Read: Yatra 2 vs CGTR: యాత్ర2కి పోటీగా కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్
చాలా గ్యాప్ తర్వాత ఆయన మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఒక యాంథాలజీ సిరీస్ లో చిన్న పాత్రలో కనిపించాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు మిస్ పర్ఫెక్ట్ అనే ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ లో ఆయన కూడా నటించాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తన కాలికి గాయమైన విషయం వెల్లడించారు. 2019లో జరిగిన చిన్న గాయాన్ని తాను పెద్దగా పట్టించుకోకపోవడంతో అది ఇప్పుడు లిగమెంట్ టియర్ అయ్యేదాకా వచ్చిందని ఈ ప్రమోషన్స్ పూర్తయ్యాక తాను సర్జరీ కూడా చేయించుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. విశ్వక్ కండేరావు డైరెక్షన్లో తెరకెక్కిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఒక అపార్ట్మెంట్లో జరిగిన కథగా దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సుప్రియ నిర్మించడం గమనర్హం.