Yatra 2 vs Cameraman Gangatho Rambabu: ఈ ఫిబ్రవరి నెలలో యాత్ర 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ఒక పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలో పాఠశాల, యాత్ర లాంటి సినిమాలు చేసి సైతాన్ లాంటి వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సొంత నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన పోటీ నెలకొంది. అదేమిటంటే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మంచి క్రేజ్ అందుకున్న కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా ఈ సినిమాకి పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నారు.
Suhas: గీతా ఆర్ట్స్ లో హీరోగా చేస్తున్నానంటే మా పేరెంట్స్ నమ్మలేదు!
ఒక రకంగా దీన్ని రీ రిలీజ్ అని చెప్పొచ్చు. మీడియాలో జాయిన్ అయిన ఒక మెకానిక్ రాజకీయ వ్యవస్థను ఎలా ఎదిరించి పోరాడారు? అనే పాయింట్ తో ఈ సినిమాని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశారు. అప్పట్లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాని ఇప్పుడు నిర్మాత నట్టి కుమార్ రెండు తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిన్న రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన ఈరోజు ఉదయం డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇంకా ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 సినిమా ధియేటర్లలోకి రాబోతుండగా దానికంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు నట్టి కుమార్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.