Bigg Boss : బిగ్ బాస్ కు మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ప్రముఖ నటి బిగ్ బాస్ షోలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంట. తాజాగా ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్‌బాస్ ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ బయట పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మేం ఓ భాషలో బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ప్రముఖ నటి షోకు వచ్చింది. అప్పటికే ఆమె బ్రేకప్ బాధలో ఉంది. ఆ బాధ నుంచి బయట పడొచ్చనే ఉద్దేశంతో షోలోకి వచ్చింది. కానీ ఓ యాక్టర్ ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నట్టు నటించాడు.
Read Also : Ranveer Singh : భర్తకు లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన దీపిక.. ఎన్ని కోట్లంటే..?
కానీ ఆ విషయం ఆమెకు అర్థం కాలేదు. నిజంగానే లవ్ చేస్తున్నాడేమో అని అతన్ని ప్రేమించింది. కానీ అతను ఫేమ్ కోసం, ఓటింగ్ కోసం లవ్ స్టోరీ నడిపించాడు. ఓ రోజు ఆమెకు అసలు విషయం తెలిసింది. అది షో అనే విషయం కూడా మర్చిపోయి తెల్లవారు జామున బాత్రూమ్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. మేం ఆమె బాత్రూమ్ లోకి కత్తి తీసుకుని వెళ్లడం చూసి వెంటనే వెళ్లి ఆమెను అడ్డుకున్నాం. సైకియాట్రిస్టులతో మాట్లాడి ఆమె మనసును ఒక వారం పాటు మార్చాం. వెంటనే ఆమెను బయటకు పంపించేశాం అంటూ చెప్పుకొచ్చారు అభిషేక్ ముఖర్జీ. కానీ ఆ యాక్టర్ పేరును బయట పెట్టలేదు.
Read Also : Chiranjeevi : విశ్వంభర సెట్స్ నుంచి మెగాస్టార్ లుక్..!