Bigg Boss 9 : బిగ్ బాస్ -9 అట్టహాసంగా స్టార్ట్ అయిపోయింది. నిన్న ఆదివారం హౌస్ లోకి 15 కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓ శృంగార తార కూడా ఉంది. ఆమె ఎవరో కాదు ఆషాసైనీ(ఫ్లోరా సైనీ). ఆమె రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నార్త్ అమ్మాయి అయినా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసింది. వడ్డే నవీన్, శ్రీకాంత్ హీరోలుగా చేసిన చాలా బాగుంది సినిమాలో వడ్డే నవీన్ భార్యగా నటించింది. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో చేసింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నరసింహా నాయుడు, వెంకటేశ్ చేసిన నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలతో పాటు 151 మూవీల్లో నటించింది. కానీ ఆమెకు పెద్దగా స్టార్ డమ్ రాలేదు. ఆ తర్వాత ఓ నిర్మాతతో ప్రేమ వ్యవహారం కాస్త చాలా గొడవకు దారి తీసింది. ఆ నిర్మాత ఈమెను చిత్ర హింసలు పెట్టాడని తెలిపింది.
Read Also : Shivani Nagaram : శివానీ నగరం ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందని తెలుసా..?
ప్రైవేట్ పార్టులపై దాడి చేశాడని ఎమోషనల్ అయింది. ఇలా బాధలు తట్టుకుని నిలబడ్డ ఈ బ్యూటీ.. ఆ తర్వాత అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడింది. ఆ టైమ్ లోనే సెమీ పోర్న్ స్టార్ గా మారింది. సెమీ పోర్న్ వెబ్ సీరిస్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా శ్రద్దా కపూర్ లీడ్ రోల్ చేసిన స్త్రీ-2 మూవీలోనూ కనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ తో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని వచ్చినట్టు తెలిపింది. బిగ్ బాస్ ఆమెకు మంచి అవకాశం అని తెలిపింది. ఈ షో ద్వారా మరిన్ని అవకాశాలు పట్టాలన్నదే ఆమె ప్లాన్ అన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో చేసిన ఈ బ్యూటీ.. ఇది రీ ఎంట్రీ అని చెబుతోంది.
Read Also : Teja Sajja : చిరంజీవి ఒక ఫొటో తీస్తే నా జీవితం మారిపోయింది.. తేజ ఎమోషనల్
