Bigg Boss 7 Telugu Launching TRP Ratings: బిగ్ బాస్ మొదలైన ప్రతిసారి ఇదేమి షో? ఇలాంటి షోలు ఎవడు చూస్తాడు అనే కామెంట్స్ కామన్. అంతేకాదు ఈ కంటెస్టెంట్స్ ఎవర్రా బాబూ ఎక్కడ్నుంచి ఎత్తుకొచ్చిన సంత రా ఇది, తెలిసిన ముఖాలే లేవు అనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే బిగ్ బాస్‌కి ఉన్న సెలెక్టెడ్ ఆడియన్స్ ఎక్కడికీ పోరు, మిగతా వాళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా వాళ్లు మాత్రం బిగ్ బాస్‌ని ఫాలో అవుతూనే ఉంటారని చెప్పకతప్పదు. సీజన్ ఏదైనా సరే తొలి ఐదువారాలు బిగ్ బాస్ షో ప్రభావం పెద్దగా ఉండదు. ఆరో వారం తరువాత నుంచి జనాలు తగ్గిన తరువాత ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
Abhishek Nama: బ్రేకింగ్: దేవరకొండ వివాదం ముగియకుండానే మరోసారి అడ్డంగా దొరికిన నిర్మాత
ఒకవేళ అందులో కంటెస్టెంట్స్ మెరుగైన ప్రదర్శన ఇస్తే ఇంకా చెప్పాల్సిన పనేలేదు. సీజన్ 1 మినహాయిస్తే మిగిలిన సీజన్లకి ఇదే విధమైన టీఆర్పీ ఇబ్బందులు ఫేస్ చేశారు. అయితే అన్ని సీజన్ల కంటే భిన్నంగా ఈ ఏడవ సీజన్ సాగుతుంది. సీజన్ హిట్టా.. ఫట్టా అని తేల్చేది లాఛింగ్ ఎపిసోడ్‌తోనే అయితే ఆరో సీజన్ అన్ని సీజన్లకంటే ఘోరమైన రేటింగ్‌ని సాధించి బిగ్ బాస్ హిస్టరీలోనే పరమ చెత్త రికార్డ్ క్రియేట్ చేయగా ఇప్పుడు మాత్రం ఏడవ సీజన్ రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్‌కి 16.18 నాని హెస్ట్ చేసిన రెండో సీజన్ 15.05, ఆ తరువాత నుంచి వరుసగా నాగార్జున హోస్ట్ చేస్తున్నాయి. మూడో సీజన్ 17.9.. నాలుగో సీజన్ 18.5.. ఐదో సీజన్ 18 రేటింగ్ సాధించగా ఆరో సీజన్ 8.86 రేటింగ్ సాధించడంతో అన్ని సీజన్లకంటే ది వరస్ట్ సీజన్ ఇదే అయ్యింది. ఇక ఈసారి మాత్రం 18.1 సాధించింది అంటూ స్టార్ మా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది, ఇది గతంలో కంటే తక్కువే అయినా రికార్డు అని పేర్కొనడం గమనార్హం.
Bigg Boss has made a spectacular return, launching with an electrifying bang! 🌟 The much-anticipated reality show has smashed records, achieving the highest TVR of 18.1 👌💯 #BiggBossTelugu7 #AkkineniNagarjuna @DisneyPlusHSTel #StarMaa pic.twitter.com/POLAsVvY8I
— Starmaa (@StarMaa) September 14, 2023