Ghaati : క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, స్టార్ హీరోయిన్ అనుష్క కాంబోలో వస్తున్న ఘాటీ మూవీపై రోజుకొక చర్చ జరుగుతోంది. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ చూసి ఇది మరో అరుంధతి అవుతుందనే నమ్మకంతో అనుష్క ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని చూశారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది.
Read Also : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. రేపే టైటిల్ గ్లింప్స్..
రేపు మూవీ నుంచి బిగ్ అప్డేట్ రాబోతోంది. మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకు భారీ అప్డేట్ ఇస్తామని మూవీ టీమ్ చెప్పింది. ఇది కచ్చితంగా రిలీజ్ డేట్ కు సంబంధించిందే అని అంటున్నారు. చూస్తుంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అనుష్క నుంచి భారీ హిట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. పైగా క్రిష్ కూడా మంచి హిట్ కొట్టి ఏళ్లు గడుస్తోంది. అందుకే ఇద్దరూ ఈ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి రేపు దేని గురించి అప్డేట్ ఇస్తారో చూడాలి.
Read Also : Aditi Shankar : మెహర్ రమేశ్ ను అంత మాట అనేసిన అదితి శంకర్..