NTV Telugu Site icon

Unstoppable 2: రొటీన్ టీజర్ అయినా భారీ వ్యూస్

Unstoppable 2

Unstoppable 2

Unstoppable 2: బాలకృష్ణ అన్ స్టాపబుల్‌కు గెస్టుగా పవన్ కళ్యాణ్ అనగానే ఎంతో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఎపిసోడ్ చిత్రీకరణ రోజు కూడా అన్నపూర్ణ స్డూడియోస్‌లో పండగ వాతావరణం నెలకొంది. గ్లింప్స్‌కు కూడా అపూర్వమైన ఆదరణ లభించింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌గా పవన్ కల్యాణ్ చిట్ చాట్ ప్రసారం కానుంది. దీంతో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇంత భారీ హైప్ ఉన్న ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ఎపిసోడ్ టీజర్ రిలీజైంది. నిజానికి ఈ టీజర్‌లో అన్నీ పాత విషయాలే.

Read Also: Naga Babu: పొత్తులు లేకుండా జనసేన పోటీ.. వైసీపీ నేతల్లా దిగజారి మాట్లాడలేం

అందర్నీ అడిగినట్టుగానే తనను బాల అని పిలవమని బాలకృష్ణ పవన్‌ను అడుగుతాడు. అలాగే గతంలో తన వదినకు కాల్ చేసి సినిమాలు మానేస్తానని చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావిస్తాడు. ఇక అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నది ఏంటి? వద్దనుకున్నదేమిటి? అని అడుగుతాడు బాలకృష్ణ. ఇక అభిమానుల ఆదరణ, ప్రేమ, ఓటు బ్యాంకుగా ఎందుకు మారలేదనే బాలయ్య ప్రశ్నకు పవన్ ఏం సమాధానం ఇస్తాడన్నది ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకో టీజర్ కట్ రొటీన్ గా ఉందనిపించింది. అయితే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండటం కోసమే మొత్తం దాచారేమో అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ఇందుకు విరుద్దంగా జరిగింది. టీజర్ తో ఎపిసోడ్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. స్ట్రీమింగ్ మొదటి రోజున సర్వర్ ఎగిరిపోయింది. అందుకే పవన్ ఎపిసోడ్ విషయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. టీజర్ తో అంచనాలు పెంచి సర్వర్‌ను క్రాష్ చేయించే కంటే కంటెంట్‌తో కొట్టాలని డిసైడ్ అయినట్లు అర్థం అవుతోంది. టీజర్ రొటీన్ గా ఉన్నా ఏకంగా ఒక్క రోజులోనే దాదాపు 3 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టడం గమనార్హం. ఇక ఎపిసోడ్ రిలీజ్ తో ఎలాంటి రికార్డులు బద్దలు అవుతాయో చూడాలి.

Show comments