Unstoppable 2: రొటీన్ టీజర్ అయినా భారీ వ్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable 2: బాలకృష్ణ అన్ స్టాపబుల్‌కు గెస్టుగా పవన్ కళ్యాణ్ అనగానే ఎంతో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఎపిసోడ్ చిత్రీకరణ రోజు కూడా అన్నపూర్ణ స్డూడియోస్‌లో పండగ వాతావరణం నెలకొంది. గ్లింప్స్‌కు కూడా అపూర్వమైన ఆదరణ లభించింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌గా పవన్ కల్యాణ్ చిట్ చాట్ ప్రసారం కానుంది. దీంతో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇంత భారీ హైప్ ఉన్న ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ఎపిసోడ్ టీజర్ రిలీజైంది. నిజానికి ఈ టీజర్లో అన్నీ పాత విషయాలే.
Read Also: Naga Babu: పొత్తులు లేకుండా జనసేన పోటీ.. వైసీపీ నేతల్లా దిగజారి మాట్లాడలేం
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
అందర్నీ అడిగినట్టుగానే తనను బాల అని పిలవమని బాలకృష్ణ పవన్‌ను అడుగుతాడు. అలాగే గతంలో తన వదినకు కాల్ చేసి సినిమాలు మానేస్తానని చెప్పిన విషయాన్ని పవన్ ప్రస్తావిస్తాడు. ఇక అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నది ఏంటి? వద్దనుకున్నదేమిటి? అని అడుగుతాడు బాలకృష్ణ. ఇక అభిమానుల ఆదరణ, ప్రేమ, ఓటు బ్యాంకుగా ఎందుకు మారలేదనే బాలయ్య ప్రశ్నకు పవన్ ఏం సమాధానం ఇస్తాడన్నది ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకో టీజర్ కట్ రొటీన్ గా ఉందనిపించింది. అయితే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండటం కోసమే మొత్తం దాచారేమో అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ఇందుకు విరుద్దంగా జరిగింది. టీజర్ తో ఎపిసోడ్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. స్ట్రీమింగ్ మొదటి రోజున సర్వర్ ఎగిరిపోయింది. అందుకే పవన్ ఎపిసోడ్ విషయంలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. టీజర్ తో అంచనాలు పెంచి సర్వర్‌ను క్రాష్ చేయించే కంటే కంటెంట్‌తో కొట్టాలని డిసైడ్ అయినట్లు అర్థం అవుతోంది. టీజర్ రొటీన్ గా ఉన్నా ఏకంగా ఒక్క రోజులోనే దాదాపు 3 మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టడం గమనార్హం. ఇక ఎపిసోడ్ రిలీజ్ తో ఎలాంటి రికార్డులు బద్దలు అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!