Bichagadu 3: ‘బిచ్చగాడు 3’ లోడింగ్.. రిలీజ్ అప్పుడే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిచ్చగాడు.. ఈ టైటిల్‌కి సినిమాకి వస్తున్న వసూళ్లకు సంబంధమే లేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర శ్రీమంతుడుగా సందడి చేస్తున్నాడు బిచ్చగాడు. ఈ సినిమాకు ఈ విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాకుండా తనే దర్శకత్వం వహించాడు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా అతనే. కావ్య తాపర్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బిచ్చగాడు… ఫస్ట్ మండేకే టార్గెట్ రీచ్ అయిపోయి బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేశాడు. అన్ని సెంటర్స్ లో లాభాల బాట పట్టిన బిచ్చగాడు 2 బిచ్చగాడు అనే బ్రాండ్ ని నిలబెట్టింది. ఇదిలా ఉంటే… బిచ్చగాడు 3 కూడా ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది. పోస్ట్ రిలీజ్ కూడా ఈ సినిమాను తమిళ్లో కంటే తెలుగులోనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని.
పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా… ‘బిచ్చగాడు 3’ ఉంటుందని చెప్పేశాడు విజయ్ ఆంటోని. ఈ లెక్కన విజయ్ ఆంటోని ఈ సినిమా సీక్వెల్స్, ప్రీక్వెల్స్ చేసుకుంటే సరిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే… బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ చేసిన సినిమా ఒక్కటి కూడా హిట్ అవలేదు. బిచ్చగాడు తర్వాత బిచ్చగాడు 2నే హిట్ ఇచ్చింది. అందుకే థర్డ్ పార్ట్‌కు ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కానుందట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. 2025లో ‘బిచ్చగాడు 3’ విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఏదేమైనా.. రాను రాను బిచ్చగాడు ఓ బ్రాండ్‌గా మారిపోనున్నాడని చెప్పొచ్చు.
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!