Bhumika Chawla Birthday Special : అందాల అమరిక… భూమిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చూడగానే తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంది భూమిక. ముద్దొచ్చే రూపంతో ఇట్టే తెలుగువారిని పట్టేసింది. తెలుగు చిత్రాలతోనే నటిగా వెలుగు చూసిన భూమిక ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. ఉత్తరాది అమ్మాయి అయినా, దక్షిణాది వాసనలనే ఇష్టపడింది భూమిక. అందుకే తెలుగు, తమిళ చిత్రాలలో ఆమెకు మంచి పాత్రలు లభించాయి. వాటితో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు భూమిక.
భూమిక అసలు పేరు రచనా చావ్లా. 1978 ఆగస్టు 21న న్యూఢిల్లీలో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ అందరిలోకి భిన్నంగా కనిపించాలని తపించేవారామె. 1997లో ముంబై చేరి అక్కడ పలు యాడ్ మూవీస్ లో నటించింది భూమిక. నాగార్జున నిర్మించిన తెలుగు చిత్రం ‘యువకుడు’ ద్వారా భూమిక చావ్లా సినిమా రంగానికి పరిచయమయ్యారు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, భూమిక అందం మాత్రం నాటి కుర్రకారుకు బంధం వేసింది. పవన్ కళ్యాణ్ సరసన ‘ఖుషి’లో నటించేసి, యువతను మరింతగా కిర్రెక్కించారు భూమిక. నాగార్జునతో ‘స్నేహమంటే ఇదేరా’, వెంకటేశ్ తో ‘వాసు’, చిరంజీవితో ‘జై చిరంజీవా’, మహేశ్ తో ‘ఒక్కడు’, జూనియర్ యన్టీఆర్ తో ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో జనాన్ని ఆకట్టుకున్నారు భూమిక. తరువాత హిందీ చిత్రసీమవైపు పరుగుతీశారు. మధ్య మధ్యలో తమిళనాట కూడా తనదైన బాణీ పలికించారు. ఏది చేసినా భూమిక తెలుగు చిత్రాలతోనే అపూర్వ విజయం సాధించారని చెప్పవచ్చు.
Also Read
భూమిక నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ ‘మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి’వంటివి ఆమెకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టాయి. ప్రముఖ యోగామాస్టర్ భరత్ ఠాకూర్ ను వివాహమాడిన తరువాత ‘తకిట తకిట’ అనే తెలుగు చిత్రం నిర్మించారు. అందులో ప్రత్యేక పాత్రలో నటించారు. బాలకృష్ణ ‘రూలర్’లో ఓ కీలక పాత్ర పోషించిన భూమిక, ‘పాగల్’లో హీరో తల్లి పాత్రలో కనిపించారు. గోపీచంద్ ‘సీటీమార్’లోనూ భూమిక ముఖ్యపాత్ర ధరించారు. ఇటీవల విడుదలై విజయవిహారం చేస్తోన్న ‘సీతారామం’లోనూ భూమిక ముఖ్యపాత్రలో కనిపించారు. తెలుగు స్టార్ హీరోస్ తో అఖండ విజయాలు చూసిన భూమిక తరువాత ఆ స్థాయి సక్సెస్ చూడక పోయినా, ఆ నాటి అభిమానుల మదిలో ఇంకా ‘ఖుషి’ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కెరెక్టర్ రోల్స్ లోనూ భూమిక అభినయాన్ని చూస్తూ ఆ నాటి అభిమానులు ఆనందిస్తున్నారు.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!