Bhoothaddam Bhaskar Narayana Title Song: శివ కందుకూరి హీరోగా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ సినిమా తెరకెక్కుతోంది. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య రిలీజ్ అయినా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్.
Saindhav: ‘సైంధవ్’ చూసి బయటికి వస్తున్న ప్రేక్షకుడి కళ్ళల్లో కంటతడి కనిపించి తీరుతుంది: నిర్మాత
శ్రీచరణ్ పాకాల స్వరపరిచి స్వయంగా పాడిన ఈ పాట చాలా క్యాచీగా ఉంద. పురుషోత్తం రాజ్, సురేష్ బనిశెట్టి రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టరైజేషన్ ని ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాయి. పాటలో విజువల్స్ చాలా అట్రాక్టివ్ గా కూడా వున్నాయి. రాశి సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివ కందుకూరి, రాశి సింగ్ లతో పాటు అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి గౌతమ్ జార్జ్ డీవోపీ.