Saindhav: ‘సైంధవ్’ చూసి బయటికి వస్తున్న ప్రేక్షకుడి కళ్ళల్లో కంటతడి కనిపించి తీరుతుంది: నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saindhav Producer Venkat Boyinapalli Exclusive Interview: విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సైంధవ్’. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత వెంకట్ బోయనపల్లి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
సైంధవ్ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?
వెంకటేష్ నాకు ఇష్టమైన హీరో. నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్న సమయంలో శైలేష్ కొలను ‘హిట్’ ట్రైలర్ చూశా. అది నాకు, నానికి చాలా నచ్చింది. అప్పటికే నాకు శైలేష్ తో పరిచయం ఉంది, వెంకటేష్ తో కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నాం. శైలేష్, వెంకటేష్ ని కలిశాడు, వాళ్ళిద్దరి వేవ్ లెంత్ చక్కగా కలిసింది. శైలేష్ చెప్పిన కథ వెంకటేష్ కి చాలా నచ్చింది. 24 గంటల్లో ప్రాజెక్ట్ ఓకే అవ్వడం నాకు చాలా సర్ ప్రైజ్ గా అనిపించింది. వెంకటేష్ 75వ చిత్రం చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
Also Read
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ఇది వెంకటేష్ 75వ చిత్రమని మీకు ముందే తెలుసా ?
వెంకటేష్ తో కలిసి పని చేయాలని నా కోరిక. దర్శకుడు శైలేష్ ఒక్కడే వెళ్లి ప్రాజెక్ట్ ఓకే చేయించుకొని వచ్చాడు. ఈ విషయంలో క్రెడిట్ అతనికి దక్కుతుంది. ఇది వెంకటేష్ 75వ చిత్రమని తెలుసు. అయితే ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది తెలీదు. మా ప్రయత్నం మేము చేశాం. ఇదే విషయం వెంకటేష్ కి చెప్పాను. ‘ఇదంతా డెస్టినీ’ అని వెంకటేష్ అన్నారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా ఇలా భారీ తారాగణం వుంది కదా.. బడ్జెట్ పరంగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అనిపించిందా ?
ఈ కథ చాలా పెద్దది. కథ అనుకున్నప్పుడే ఇది ఎక్స్పెన్సివ్ మూవీ అని తెలుసు. కథకు తగ్గట్టు చాలా గ్రాండ్ గా నిర్మించాం.
సంక్రాంతికి ఫ్యామిలీ కథలు రావడం వేరు.. ఇలాంటి యాక్షన్ కథలు రావడం అరుదు కదా ?
‘సైంధవ్’ చూస్తున్నప్పుడు అందులో అద్భుతమైన ఎమోషన్ కన్నీళ్లు తెప్పిస్తుంది. సినిమా చూసి బయటకు వస్తున్ననప్పుడు ప్రేక్షకుడి కళ్ళల్లో గొప్ప భావోద్వేగంతో కూడిన కంటతడి కనిపిస్తుంది. ‘సైంధవ్’ న్యూ ఏజ్ యాక్షన్ తో కూడిన మంచి ఫ్యామిలీ సినిమా.
వెంకటేష్ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోషన్స్ లో కాలేజీ ఈవెంట్స్ కి హాజరవ్వడం ఎలా అనిపించింది ?
వెంకటేష్ చాలా సరదాగా ఉంటారు. సినిమా కంటెంట్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ఆయన సహజంగానే చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రమోషనల్ ఈవెంట్స్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు.
మీ చిత్రాలలో మ్యూజిక్ ని కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నారు కదా ?
ఏదైనా సబ్జెక్ట్ ని బట్టి ఉంటుంది. శ్యామ్ సింగరాయ్ కి సాఫ్ట్ మ్యూజిక్ కావాలి. మిక్కీ జే మేయర్ చక్కని మ్యూజిక్ ఇచ్చారు. సైంధవ్ యాక్షన్, ఎమోషన్ లార్జర్ గా వుంటాయి. సంతోష్ నారాయణ్ చాలా అద్భుతంగా చేశాడు.
సహజంగా ఒక సినిమా విజయం సాధించిన వెంటనే నిర్మాతలు హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ లు ఇస్తున్నారు.. కానీ మీలో ఆ ధోరణి కనిపించదు.. కారణం ?
ఇష్టమైన వ్యక్తులతో పని చేయాలని భావిస్తాను. నాని గారు నాతో రెండు సినిమాలు చేసి నన్ను నిర్మాతని చేశారు. ఆయన అంటే మొదటి నుంచి ఇష్టం. అలాగే వెంకటేష్ గారు అంటే కూడా చాలా ఇష్టం. నాకు ఇష్టమైన ఇద్దరు హీరోలతో కలిసి సినిమాలు చేశాననే ఆనందం వుంది. అందరితో కలిసి పని చేయాలని ఉంటుంది. ఐతే ఇష్టమైన వారితో సినిమా చేసినప్పుడు ఆలోచించాల్సిన పని ఉండదు.
‘వెంకీ 75’ వేడుక ఆలోచన ఎవరిది ?
ఇది రానా గారి ఆలోచన. సినిమా మొదలుపెట్టినప్పుడే స్పెషల్ చేయాలని అనుకున్నాం. రానా వేడుక ఆలోచన చెప్పారు. ఆ క్రెడిట్ రానాకి దక్కుతుంది.
రవితేజ ‘ఈగల్’ వాయిదా మీకే ఎక్కువ హెల్ప్ అవుతుందని వినిపిస్తోంది ?
వాయిదా వేయడం ఆయన గొప్పతనం. ఇది అందరికీ బెనిఫిట్ అవుతుందని భావిస్తున్నాం.
వెంకటేష్, నానితో మల్టీస్టారర్ చేయాలనే ఆలోచనలో వున్నారని విన్నాం?
అవునండీ. వెంకటేష్ గారు, నాని గారు నాకు ఇష్టమైన హీరోలు. ఇద్దరితో విడివిడిగా సినిమాలు చేశాను. వారిద్దరితో మల్టీస్టార్ట్ మూవీ చేయాలనేది నా డ్రీమ్. నేను చేయాలని ప్రయత్నిస్తా. ఎవరు చేసినా ఎంజాయ్ చేస్తాను.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు